పయనించే సూర్యుడు, మార్చి 07,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భూర్గంపాడు మండలం సారపాక లో పరశురాం పరివార్ హిందూ సంస్థ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పరశురాం పరివార్ హిందూ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్ మాట్లాడుతూ మేము సంస్థ ద్వారా మంచి మంచి ఆధ్యాత్మిక హిందూ కార్యక్రమాలను, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నామని, ఈ క్రమంలోనే కొంతమంది సభ్యులు మా కార్యక్రమాలకు ముగ్ధులై సంస్థలో జాయిన్ అవుతున్నారని, మునుముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. జాస్తి శివరాం, అన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ కొన్ని రోజులుగా ఈ సంస్థ కార్యక్రమాలను చూస్తున్నామని, మేము కూడా ఆధ్యాత్మికంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని, ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, సంస్థ కార్యక్రమాలకు ఆకర్షితులం అవటం వలన ఈ సంస్థలో జాయిన్ అయ్యామని తెలిపారు. సంస్థ సభ్యులను కలుపుకుంటూ కార్యక్రమాలలో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి జ్యోతిష్య కేంద్రం వ్యవస్థాపకులు దేవులపల్లి సాయి కిరణ్ శర్మ, పరశురాం పరివార్ జిల్లా ప్రదాన కార్యదర్శి కరకు ప్రసాద్, సూరేపల్లి పవన్ కళ్యాణ్, దూర్వాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
