పయనించే సూర్యుడు మార్చి 7 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ అనుబంధ కమిటీల ఏర్పాటుపై ముఖ్యమైన చర్చలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జోనల్–5 కోఆర్డినేటర్ బీద రవిచంద్ర మరియు ప్రోగ్రామ్ కమిటీ ఇంచార్జి రాంబాబు ,ర్నూలు పార్లమెంట్ కోఆర్డినేటర్ వీరయ్య చౌదరి సూచనల మేరకు కర్నూలు జిల్లా నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబుకర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆదోని నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి ఎమ్మెల్సీ బీటి నాయుడు పాల్గొన్నారు. పార్లమెంట్ స్థాయి కమిటీలను బలోపేతం చేసి, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత శక్తివంతం చేయాలనే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిపారు. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
