
పయనించే మార్చి 7 కరీంనగర్ న్యూస్: ఖేలోఇండియాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ తలపెట్టిన ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవం ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం రోజున కరీంనగర్ పార్లమెంట్ స్థాయి క్రీడా పోటీలు స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం లోని అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో వివిధ క్రీడా పోటీల్లో అర్హత సాధించి, విజేతలుగా నిలిచిన టీంలకు పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు గంగా డి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి , నగరపాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ కోలగని శ్రీనివాస్, సునీల్ రావు , కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు హాజరైన ముఖ్య అతిధులు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన శైలిలో క్రీడలు ఒక భాగమని, క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే కాకుండా, మానసిక సమస్యలను దూరం చేస్తాయన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. క్రీడలు క్రమశిక్షణ, బృందస్ఫూర్తి, చెట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాలు, వ్యూహరచన నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచన అలవాడేలా చేస్తాయన్నారు. భేటీ ఈ ఆధునిక కాలంలో విద్య ఎంత అవసరమో క్రీడలు అంతే అవసరం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ క్రీడా పోటీలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ముఖ్యంగా యువతకు ఇదొక మంచి వేదిక అయిందన్నారు. పార్లమెంట్ పరిధిలో నిర్వహించే వివిధ క్రీడలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, అసెంబ్లీ స్థాయిలో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచి అర్హత సాధించిన సాధించిన జట్టులకు పార్లమెంట్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పార్లమెంటు స్థాయిలో విజేతలుగా నిలిచే మొదటి, రెండవ స్థానం పొందిన టీం లకు ఈనెల 8 న బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, కార్పొరేటర్ లు బోయిన్పల్లి ప్రవీణ్ రావు, కేపీ చంద్ర, నాంపల్లి శ్రీనివాస్ , తాటి ప్రభావతి, పెద్దపల్లి శ్రీలేఖ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ గుజ్జశ్రీనివాస్, ఎర్రం మహేష్, కరండ్ల మధుకర్, తణుకు సాయి కృష్ణ, శ్రవణ్, విమల్ తదితరులు పాల్గొన్నారు

