పెనుగంచిప్రోలు మండలంలో పర్యటిస్తున్న ఎన్ఐటీఐ.ఏఏవైఓజీ అధికారి…

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా.. జగయ్యపేట నియోజకవర్గం. మార్చి 7 పెనుగంచిప్రోలు. గ్రామలోని ఈరోజున.. నీతి ఆయోగ ఆధ్వర్యంలో అమలు అవుతున్న ఆస్పిరషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం, సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాధిక మూలయా పెనుగంచిప్రోలు మండలాని సందర్శించారు, ఈ సందర్భంగా ముళ్లపాడు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని, చెత్త సేకరణ కేంద్రాన్ని, పలు ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడి కేంద్రాలను, ప్రభుత్వ వైద్యశాల, అలాగే ఆయా శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్న సేవలు మరియు పథకాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు, అదేవిదంగా ఆస్పిరషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం క్రింద చేపడుతున్న కార్యక్రమాల అమలు స్థితి లక్ష్యల సాధన ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాల పై సంబంధిత అధికారులతో చర్చించారు, ఈ పర్యటనలో ఎంపీడీవో, జీ.శ్రీను.ఎమ్మార్వో, శాంతి లక్ష్మీ .సర్పంచ్ వేల్పుల పద్మ కుమారి, ప్రాథమిక ఆరోగ్య డాక్టర్ అనురాధ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్యాం కుమార్ మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.