పయనించే సూర్యుడు మార్చి 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శుక్రవారం నాడు జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా దంత వైద్య సేవలు స్వయంగా వైద్యునిగా అందిస్తున్నానని,గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు దంత వైద్య సేవలు మెరుగ్గా ఉండేందుకు కృషి చేస్తానని అన్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణలో దంత వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. గుండె, ప్రేగు, ఇతర ఆపరేషన్ లు చేసేముందు దంత వైద్యుల సూచనలు కూడా తీసుకుంటారని అన్నారు. నవజాత శిశువులలో వచ్చే పండ్లు తొలగింపులో వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. నోటిలో పండ్లు బాగుంటే శరీరం బాగుంటుందని అన్నారు. శాసనసభ్యులు శిబిరంలో స్వయంగా రోగులను పరీక్షించి దంత వైద్య సేవలు అందించారు. అనంతరం ఆసుపత్రి లోని వైద్యుల సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమాదేవి, ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి, డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్, దంత విభాగపు అధిపతి డాక్టర్ శైలజ, సివిల్ సర్జన్ ఆర్.ఏం.ఓ.డాక్టర్ రవిశంకర్,దంత వైద్యులు డాక్టర్ నాగ మాధురి,డాక్టర్ రాజశేఖర్,డాక్టర్ రోహిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు,మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్,సిందుజా, సునీత, ఆస్పత్రి ఏ.డి.వసంత్, ఇతర కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.