ప్రమాదానికి గురైన భవన కార్మికుడిని పరామర్శించిన’

★ టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 07 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండలంలోని బస్సులుదొడ్డి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు బోయ హనుమంతుడు ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆదోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. అవసరమైతే కర్నూలుకు తరలించి చికిత్స అందించాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేష్, కటికే రాజఅహ్మద్ పాల్గొన్నారు.