బీజేపీ విధానాలతో దళితుల మనుగడకు ముప్పు

★ (ఉద్యమించేందుకు దళితులు ఏకం కావాలి.★ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్)

పయనించే సూర్యుడు న్యూస్: మార్చి/07: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం:మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ, మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక, అభివృద్ధి నిరోధక విధానాలను ఎండగడుతూ ఉద్యమించేందుకు దళితులంతా ఏకం కావాలని ఏఐసీసీ జాతీయ ఎస్సీ విభాగం అధ్యక్షుడు రాజేంద్ర పాల్ గౌతమ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ భవన్ లో టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన టీపీసీసీ ఎస్సీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్ర పాల్ గౌతమ్ మాట్లాడుతూ దళితులను అణగదొక్కేందుకు బీజేపీ, ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తున్నదని ఘాటుగా విమర్శించారు. దళితులపై రాజకీయంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగానూ పెత్తనం చెలాయించాలని చూస్తున్నదని, ఈ కుట్రలను తిప్పి కొట్టకుంటే దళితుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలకులు పథకం ప్రకారమే దళితులను విద్యకు దూరం చేస్తున్నారని, ఈ విధానాల ఫలితంగానే ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు విద్య దళితులకు, బడుగు బలహీనవర్గాలకు అందని ద్రాక్షగా తయారయిందని ఆయన విమర్శించారు. గత పన్నెండు సంవత్సరాలలో కేంద్ర బడ్జెట్ లో విద్యకు కేవలం రెండు శాతం మాత్రమే నిధులు కేటాయిస్తుండటం వల్ల కేంద్ర ప్రభుత్వ విధానమేమిటో తేటతెల్లమవుతున్నదని ఆయన పేర్కొన్నారు. అందువల్లనే దళితులకు, బడుగు బలహీనవర్గాల పిల్లలకు స్కాలర్ షిప్పులు కూడా ఇవ్వడం లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వరంగ విద్యా సంస్థలకు నిధులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారని, తద్వారా పిల్లలు విద్యకు దూరమై కూలీ పనులు చేసుకునే పరిస్థితి కల్పించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 12న బాధ్యతల స్వీకరణ టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 12 వ తేదీన గాంధీ భవన్ లో టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం దళితులను సంఘటితం చేసి కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తోపాటు దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని దళిత సంఘాల నాయకులు హాజరవుతారని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళితులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఈ సమావేశంలో జాతీయ ఎస్సీ విభాగం సమన్వయకర్త శుక్లా, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.ప్రీతం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అచ్యుత్ రమేష్, టీపీసీసీ దళిత విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఉస్మానియా జాక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.