మంగళగిరిలో టీడీపీ జిల్లా కమిటీ ఎంపిక సమావేశం

★ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి హాజరయ్యారు

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 07 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జోనల్ ఇంచార్జ్ బీద రవిచంద్ర, మంత్రి టీజీ భరత్ నేతృత్వంలో శుక్రవారం కర్నూలు జిల్లా కమిటీ ఎంపిక సమావేశం జరిగింది. మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకులు ఎన్.రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, జిల్లాలో నిర్మాణం మరింత బలపడే చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జిల్లా ఎన్డీఏ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు.