పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 07 మామిడిపెల్లి లక్ష్మణ్ మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాయికల్ మండలంలోని ధర్మాజీపేట గ్రామంలో రూ.10 లక్షల నిధులతో వెలుగు కీర్తి మహిళా సంఘం భవన నిర్మాణానికి,కట్కాపూర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో సౌమిత్రి లక్ష్మీ నరసింహ మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి, వస్తాపూర్ గ్రామంలో రూ.10 లక్షల నిధులతో దుర్గామాత మహిళా సంఘం నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల పేరుతోనే అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళలు వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారస్తులుగా ఎదగాలని సూచించారు. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. నాలుగు మహిళా సంఘాల భవనాలకు రూ.10 లక్షల చొప్పున భూమిపూజ చేయడం ఆనందదాయకమని అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నూతన ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రజల మన్ననలు పొందుతారని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు,పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాలపై 99 రోజుల కార్యాచరణను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, ఎమ్‌పీఓ సుష్మా, సర్పంచ్‌లు గంగారెడ్డి, గూగులోతు తిరుపతి, పడాల పూర్ణిమ, ఉప సర్పంచ్‌లు అంజాద్, గణేష్, సంజీవ్, మాజీ ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బెజ్జంకి మోహన్,మండల నాయకులు రవీందర్ రావు,కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి,రాజమౌళి, రాజిరెడ్డి, షేక్ ముజాహిద్, ధర్మరాజు, హరీష్, వెంకటేశ్, చిరంజీవి, మరిపెళ్లి శ్రీనివాస్ గౌడ్, శేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మల్లయ్య, బాపన్న, అభి, రాజశేఖర్, గంగరాజం, తిరుపతి, ఏఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.