మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ

* మిత్ర ఫౌండేషన్ 100వ కార్యక్రమం

పయనించే సూర్యుడు, మార్చి 7 2026, నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణంలో మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 వ సేవా కార్యక్రమంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి స్పూర్తిని ప్రజల్లో పెంపొందించేందుకు మరియు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తరతరాలకు గుర్తు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు యువతకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సమాజంలో దేశభక్తి భావాన్ని పెంపొందించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని తెలిపారు. మిత్ర ఫౌండేషన్ అధ్యక్షులు కుకుడాల శ్రీకాంత్ నేత మాట్లాడుతూ, సంస్థ ప్రారంభమైనప్పటి నుండి సమాజ సేవే లక్ష్యంగా తీసుకొని ఇప్పటివరకు 100 సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.100వ కార్యక్రమం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కరణ కావడం మాకు చాలా సంతోషం అని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ వంటి రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బృంగి రత్నమాల, మాజీ జాతీయ బిసి కమిషన్ మెంబర్ తల్లొజు ఆచారి, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణంలోని వివిధ కాలనీల ప్రజలు, యువకులు, నేతాజీ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *