మేలు జాతి లేగదూడల ప్రదర్శన

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు ఎం. మర్రిపాడులో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో మేలు జాతి లేగదూడల ప్రదర్శనను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ యొక్క లేగదూడలను ప్రదర్శనకు తీసుకొచ్చారు. పశు వైద్యులు పద్మావతి, పాపారావు, మధుబాబు ఆధ్వర్యంలో రైతులకు ప్రోత్సాహకాలు అందించారు. అనంతరం లేగదూడల పెంపకంపై పలు సూచనలు, సలహాలు రైతులకు పశు వైద్యులు పాపారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, మురిపింటి నారాయణ, రాపాక శాంతారావు, కోనారి గణపతి, అంబటి నారాయణ, కోనేరి వల్లభరావు, కొంచాడ మోహనరావు రైతులు తదితరులు పాల్గొన్నారు.