మైతాఫూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ

★ సర్పంచ్ తలారి నాగమణి రాజేష్

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 07 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని మైతాఫూర్ గ్రామంలో శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా గ్రామసభను నిర్వహించినట్లు సర్పంచ్ తలారి నాగమణి రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి తొగిటి వేణు మాట్లాడుతూ, నేటి నుండి ఈ నెల 15వ తేదీ వరకు ప్రతి రోజు ఒక్క కార్యక్రమం చొప్పున అమలు చేసే ప్రణాళికను గ్రామస్థులకు చదివి వినిపించారు. అనంతరం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, ఉప సర్పంచ్ దొంగ ప్రణయ్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్, నవీన్, అనుమల్ల రమ, బుస గంగామల్లయ్య, కొల్ల ప్రమీల, బొమ్మను లక్ష్మి, దివాకర్ రెడ్డి, నెమిళ్ల లత, పరమేశ్వర్, అంగన్వాడీ టీచర్లు లత, మమత, ఆశా వర్కర్లు శంకరమ్మ, మహిళా సంఘాల నాయకులు లత, బండి సుమలత, బండి భావనతో పాటు గ్రామస్థులు సత్యనారాయణ, భవాని, శేఖర్, రాములు, రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.