యుద్ధాన్ని వెంటనే ఆపండి!ప్రపంచ శాంతి కాపాడండి!! ఐక్య రాజ్యసమితి జోక్యం చేసుకోవాలి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 07.03 2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) ఇరాన్,తో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తలపడుతూ యుద్ధం కొనసాగిస్తున్న నేపధ్యం లో వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తక్షణం యుద్ధం ఆపేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకోవాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజన్ పేర్కొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ పుంగనూరు నియోజకవర్గ కమిటీ ని, అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా శుక్రవారం భగత్ సింగ్ కాలనీలో రామ్మూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి టీ. జనార్దన్ లు హాజరయ్యారు. సమావేశం తొలుత ఇరాన్- అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న పలువురు అమాయక ప్రజలకు సంతాపం తెలియజేసింది. అనంతరం జరిగిన సభలో నాగరాజు మాట్లాడుతూ ఒకనాడు అలీన దేశాలకు ప్రపంచ శాంతికి కేంద్ర బిందువుగా ఉన్న భారత ప్రభుత్వం యుద్ధాన్ని నివారించేందుకు, ఒక దేశ అధ్యక్షుడిని మట్టు పెడితే ఖండించేందుకు గాని పూనుకోక పోవడం దుర్మార్గమన్నారు. యుద్ధం నివారించకపోతే అణుయుద్ధంగా రూపాంతరం చెంది ప్రపంచ మానవాళికే ముప్పు వాటిల్లుతుందనే విషయం గుర్తించకపోవడం దారుణమన్నారు. ఐక్యరాజ్యసమితి సత్వరం జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సిపిఐ అన్నమయ్య జిల్లా సెక్రెటరీ పి.మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఏమీ వ్యవహరించడం లేదని ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతున్నారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణచి వేయాలనుకుంటే ప్రజాగ్రహం చవిచూడక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు, టిడ్కోఇండ్లు, ఇంటి స్థలాలు కేటాయించడంలో జరిగే జాప్యంపై ఉద్యమించాలని తెలిపారు.రాష్ట్రం విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరం చేస్తున్నారని, కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, ఉపాధి హామీని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. ఈ నేధ్యంలో పార్టీ ఉద్యమం బలోపేతం చేసేందుకు,నిర్మాణం కోసం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గడపగడపకు సిపిఐ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ నిధులు వసూలు చేసేందుకు కృషి చేయాలని పిలుపిచ్చారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు చౌడేపల్లె, సోమల. సదుం మండలాలను అన్నమయ్య జిల్లా సిపిఐ సమితిలో విలీనం చేస్తున్నట్లు నాగరాజు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా సెక్రెటరీ మహేష్ మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గాన్ని తమ జిల్లాలో కి సాదరంగా ఆహ్వానిస్తూ జిల్లాలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి టి. కృష్ణప్ప, ఏఐటియుసి జిల్లా సెక్రటరీ ఎం సాంబశివ,, రైతు సంఘం జిల్లా సెక్రెటరీ వి. రంగారెడ్డి ఏ ఐఎస్ ఎఫ్ జిల్లా సెక్రెటరీ ఎం.మాధవ్ లు పాల్గొని ప్రసంగిస్తూ పుంగనూరు నియోజకవర్గం లోని పలు ప్రజాసంఘాలను అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అనంతరం అన్నమయ్య జిల్లా సెక్రెటరీ మహేష్ పుంగనూరు పట్టణంలో పార్టీ సీనియర్ సభ్యులు అయిన డా.టీ జనార్దన్ కు పార్టీ సభ్యత్వం అందజేశారు. సమావేశానికి పుంగనూరు సహాయ కార్యదర్శి మున్నా స్వాగతం పలకగా ఏఐటియుసి కార్యదర్శి వెంకటరమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *