యువకుడు ఆత్మహత్య

పయనించే సూర్యుడు 07-03-2026 రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని తంగుడుబిల్లి గ్రామానికి చెందిన బలిజ అరవింద్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. జి కొత్తపల్లి తంగుడుబిల్లి గ్రామాల మధ్య గల గిడసారం చెరువు సమీపానగల మామిడి చెట్టుకు గురువారం రాత్రి12.00 గంటల ప్రాంతం లో యువకుడు ఇంటి నుండీ బైటకి వెళ్లి 2 గంట ల వరకు కుటుంబికులు ఫోన్ చేయగా ఫోన్ ఎత్తలేదు . శుక్రవారం ఉదయం 8.50 ని లు జీ కొత్తపల్లి గ్రామస్తులు ఉపాధి పనులకు వెళ్లగా బైక్ నెంబర్ ఏపీ 31 7265 ఘటన స్థలం లో ఉంది ఉరివేసుకొని మృతి చెందిన దృశ్యం చూసి తంగుడుబిల్లి గ్రామస్తులు చూసి సమాచారం అందించారు. తంగుడుబిల్లి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు చిడికాడ ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. చనిపోయిన వ్వక్తి బలిజ అరవింద్ s/o సింహాచలం పిర్యాదు చేయడం ఐనది