రామడుగు గ్రామంలో అంగన్వాడి కేంద్రాల్లో గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు

పయనించే సూర్యుడు మార్చి 07 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండల కేంద్రంలోని రామడుగు గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీ. పార్వతీ రమేష్ గౌడ్, మరియు ఉప సర్పంచ్, శ్రీ .లోలం రాజేశ్వర్, హాజరు కావడం జరిగింది గ్రామంలోని ప్రతి గర్భిణీ ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి అక్కడ ఇచ్చే ఒక్కపూట సంపూర్ణ భోజనం తప్పకుండా తీసుకోవాలని తెలియజేశారు అలాగే భోజనం తర్వాత ఐరన్ ఫో లీక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలని తెలియజేశారు అంగన్వాడీ కేంద్రాలలో మెనూ ప్రకారంగా వండే భోజనంలో పోషకాహారం ఎంతో ఉంటుందని దానిని ప్రతి ఒక్క గర్భవతి ,బాలింత వినియోగించుకోవాలని తెలియజేసినారు ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తెలియజేశారు నూతన జాతీయ విద్యా విధానం ప్రకారంగా అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన విద్యను బోధిస్తారని తల్లిదండ్రులకు తెలియజేసినారు కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్లు జరుపుతూ అవగాహన కార్యక్రమాలను కల్పించడం జరుగుతుంది అని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ టీ .గోదావరి వార్డు మెంబర్లు , గ్రామంలోని లబ్ధిదారులు మరియు తల్లులు అందరూ హాజరు అయినారు.