పయనించే సూర్యుడు, మార్చి 7 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని వివిధ హాస్టలను, రేషన్ డీలర్ షాపును రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, విద్యా కమిషన్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి, అధికారులు శుక్రవారం ఆకస్మిత తనిఖీ చేశారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ రేషన్ డీలర్ షాపును తనిఖీ చేస్తూ ప్రతి రేషన్ కార్డుదారులకి రేషన్ బియ్యం అందేలా చూడాలని తెలియజేశారు. అలాగే ఏకలవ్య పాఠశాలను సందర్శించి హాస్టల్లో ఉన్న కిచెన్‌ను పరిశీలించి వంటలు విద్యార్థులు తినే విధంగా ఉండాలని సూచిస్తూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. వంటలకు నాణ్యమైన పాత్రలు వాడాలని, విద్యార్థులకు పెట్టే గుడ్లను పరిశీలించి, సైజు తక్కువగా ఉండడంవల్ల గుడ్లలో ఉండే పోషకాలు ఏమి ఉండవు అని తెలియజేస్తూ తక్కువ సైజు ఉన్న గుడ్లను ఎందుకు రిటన్ చేయడం లేదని ఆరాతీశారు. ఫిబ్రవరి 18 తేదీన వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు ధర్నా చేసిన సంఘటన సందర్భంగా గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకొని విద్యార్థులకు ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తానని చెప్పి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలకు తగిన సూచన లిస్తు మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలియజేశారు. అంగన్వాడి సెంటర్లను కూడా తనిఖీ చేయడం జరిగింది. కల్వకుర్తి మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రి, సివిల్ సప్లై గోదాములు, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాలలు తనిఖీ చేశారు. డిఎం సివిల్ సప్లై రాజేందర్, తదుపరి అధికారులతో సమీక్ష జరిపి వారి తనిఖీల్లో తెలిసిన విషయాలను తెలిపి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జనార్ధన్ రెడ్డి, ఎమ్మార్వో కార్తీక్ కుమార్, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి, ఎంఈఓ చంద్రుడు నాయక్, అంగన్వాడి సిడిపిఓ, సూపర్వైజర్, వివిధ శాఖల అధికారులు, వివిధ నాయకులు పాల్గొన్నారు.