పయనించే సూర్యుడు మార్చి 7 (జనగామ ప్రతినిధి కమ్మగానినాగన్న)జనగామలో నిర్వహించిన సోమేశ్వర రీజియన్-8 రీజియన్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి నిర్వహించిన విశిష్టమైన సామాజిక సేవలను గుర్తిస్తూ క్లబ్‌ను ఘనంగా అవార్డులతో సత్కరించారు లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండి పేద ప్రజలకు సహాయం చేయడం, విద్యార్థులకు ఉచిత పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేయడం, అవసరార్థులకు గొడుగులు పంపిణీ చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందింది. ఈ సేవలను ప్రశంసిస్తూ సోమేశ్వర రీజియన్ నాయకులు క్లబ్‌కు బెస్ట్ క్లబ్ అవార్డు అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి సభ్యులందరి కృషిని రీజియన్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. క్లబ్ సభ్యుల సమిష్టి సహకారం, సేవాభావం వల్లనే ఈ గౌరవం దక్కిందని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి సభ్యులు సంకల్పం వ్యక్తం చేశారు.సోమేశ్వర రీజియన్-8 కాన్ఫరెన్స్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తికి క్లబ్‌కు బెస్ట్ క్లబ్ అవార్డుతో పాటు, క్లబ్ అధ్యక్షుడు బెస్ట్ ప్రెసిడెంట్ కార్యదర్శి బెస్ట్ సెక్రెటరీ కోశాధికారి బెస్ట్ ట్రెజరర్ అవార్డులు అందుకున్నారు. అలాగే క్లబ్ నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మొత్తం 12 వరకు అవార్డులు ప్రదానం చేయడం విశేషం ఈ సందర్భంగా అవార్డులు రావడానికి సహకరించిన క్లబ్ సభ్యులందరికీ లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి అధ్యక్షులు లయన్ చారగొండ్ల ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు