పయనించే సూర్యుడు మార్చి 7 దౌల్తాబాద్ రాజేష్ దౌల్తాబాద్, మార్చి 06: దౌల్తాబాద్ మండలం శేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు విద్యను బోధించారు. డీఈవోగా అయాజ్, మండల విద్యాధికారిగా వర్షిత, ప్రధానోపాధ్యాయురాలుగా మనస్విని తోపాటు పలువురు విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు స్వయం పరిపాలనతో తమ బాధ్యతలను తెలుసుకుంటారని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బోధన అంశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అమల, హర్షిణి, తదితరులు పాల్గొన్నారు..