వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 7 జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు న పట్టవ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఈనెల 17, 18 తేదీలలో చీమలపాడులో జరుగుతున్నాయని ఆ మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోటా కళ్యాణ్ కోరారు. మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో శుక్రవారం గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట కళ్యాణ్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు వ్యవసాయ రంగంలో సంపద సృష్టించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికుల శ్రమవల్లే సామాన్యుని నుండి దేశప్రధాని వరకూ ఐదువేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. వారి సమస్యలపై నిరంతరం పనిచేసే సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఈ సంఘం జిల్లా 33వ మహాసభలు 2026 మార్చి 17, 18 తేదీల్లో చీమలపాడులో జరగనున్నాయి. ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఏ.కొండూరు మండలం కిడ్నీ సమస్య, రైతాంగ పోరాటాలు, భూమి, కూలి, ఉపాధి హామీ పోరాటాలకు నిలయం. నేటికి ఈ పోరాటాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మహాసభలు జరిపి తలపెట్టారు. భూ సమస్య పై వివిధ రూపాల్లో అనేక సమరశీల పోరాటాలు నిర్వహించడంతోపాటు ప్రభుత్వానికి చెందిన మిగులు భూములు, ఇండ్లస్థలాల సమస్యలపై, అసైన్డ్, సీలింగ్, భూములపై వ్యవసాయ కార్మిక సంఘం నిరంతరం పోరాడుతున్నది. ఎన్డీయె కూటమిలోని కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు చేసింది విడి జి రామ్ జీ పేరు తో కొత్త చట్టం ను తీసుకుని రావడం జరిగింది పాత చట్టం అమలు చేయాలని ఆందోళన లు చేస్తుంది. కులవివక్ష వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోట కృష్ణ, వ్యవసాయ మెట్లు మస్తాన్ వలీ, సుగుణ, పద్మ, ఇమాంబీ, భాస్కరరావు, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.