సైనిక్ స్కూల్‌లో సీటు సాధించిన మంచాలపల్లి విద్యార్థి కొమ్మూరు హేమంత్

పయనించే సూర్యుడు న్యూస్ : మార్చ్ 7 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం మండలం మంచాలపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరు హేమంత్ సైనిక్ స్కూల్‌లో సీటు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. హేమంత్, బాలయ్య – వరలక్ష్మి దంపతుల కుమారుడు.దేశవ్యాప్తంగా నిర్వహించే సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఈ అరుదైన అవకాశాన్ని పొందాడు. కఠినమైన పోటీ మధ్య హేమంత్ సాధించిన ఈ విజయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే కష్టపడి చదువుతూ ప్రతిభ కనబరిచిన హేమంత్‌కు ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు బంధువులు అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో భారత సైన్యంలో ఉన్నత స్థాయికి చేరుకొని దేశానికి సేవ చేయాలని గ్రామ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు. హేమంత్ సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.