హాస్టల్లో- ఫ్రైడే డ్రై డే

పయనించే సూర్యుడు 7 మార్చి 2026 చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా కొప్పునూర్ ఎస్సి బాలుర హాస్టల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మరియు శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాలు ఫ్రైడే -డ్రై డే నిర్వహించారు. హాస్టల్ ప్రాంగణము వర్కర్స్ శుభ్రం చేశారు అనంతరం హాస్టల్ ఇన్చార్జ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇది గొప్ప ఆరోగ్య కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని గ్రామంలోని ప్రజలందరూ పాటించాలని కోరారు హాస్టల్లోని పరిసరాల్లో క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం ద్వారా అంటూ వ్యాధులు రాకుండా ఉంటాయని దోమల నుండి పాముల నుండి రక్షణ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమం ప్రతిరోజు కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో హాస్టల్లో వర్కర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.