హుజూర్ నగర్-కోదాడ రహదారులకు మహార్దశ..49 కిలోమీటర్ల డబుల్ రోడ్డుకు రూ.130 కోట్లు మంజూరు

★ సింగిల్ రోడ్లకు గుడ్ బై..49 కి.మీ డబల్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ హుజూర్ నగర్ కోదాడకు రోడ్ల బూస్ట్..ఎండీఆర్ కింద భారీ నిధులు:

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా:హుజూర్నగర్,కోదాడ నియోజకవర్గం పరిధిలోని ఆర్&బీ రహదారులకు మహార్దశ పట్టింది ఇప్పటివరకు సింగిల్ రోడ్లుగా ఉన్న సుమారు 49.10 కిలోమీటర్ల రహదారులను డబుల్ లైన్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ అభివృద్ధి పనులు మేజర్ డిస్టిక్ కోడ్ ఎండిఆర్ ప్లాన్ కింద చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తయ్ పద్మావతి రెడ్డిల కృషితో ఈ నిధులు మంజూరు అయ్యాయి. పట్టుదల ఫలితంగా రెండు నియోజకవర్గాలలో రహదారి అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే,హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో సుమారు 26.50 కిలోమీటర్ల రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.62 కోట్లు మంజూరు చేశారు దీనివల్ల సుమారు 15 గ్రామాలకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి చింతలపాలెం, కిష్టాపురం వరకు 9.20 కి.మీ రహదారిని రూ.32 కోట్లతో డబుల్ రోడ్డు గా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల చింతలపాలెం, శోభనాద్రి గూడెం, అడ్లూరు, తమ్మారం, కొత్తూరు కిష్టాపురం గ్రామాలకు లాభం చేకూరుతుంది.రామలక్ష్మి పురం-హుజూర్నగర్ బైపాస్ వరకు 3.8 కి.మీ: రహదారి డబుల్ లైన్ గా మారనుంది. అమరావరం కొత్త తండా వరకు 5.50 కి.మీ రహదారి రూ.30 కోట్లతో విస్తరించనున్నారు. గుడుగుంట్ల పాలెం, ఎల్లాపురం వరకు సుమారు 8 కి.మీ: రహదారిని కూడా డబుల్ లైన్ గా అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా: కోదాడ నియోజకవర్గం: పరిధిలో 22.60 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి రూ.68 కోట్లు మంజూరు చేశారు. దీనివల్ల తొమ్మిది గ్రామాలకు రాకపోకలు సులుభం కానున్నాయి. కోదాడ అనంతగిరి వరకు:6.60 కి.మీ రహదారిని 7 మీటర్ల నుంచి 10 మీటర్ల వెడల్పుతో రూ.30 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఎన్ ఎచ్-9 నుంచి నేలమారి వరకు 10 కి.మీ రహదారిని రూ.24 కోట్లతో డబుల్ లైన్ గా నిర్మించనున్నారు.దీనివల్ల తాడ్వాయి మరియు తండా, వెంకట్రాంపురం, నేలమారి గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను తక్షణమే టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ రహదారి విస్తరణతో హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల గ్రామాల మధ్య రాకపోకలు వేగవంతం కావడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపిరి రానుంది..