పయనించే సూర్యుడు మార్చి 07 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించడంతో పాటు ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఉట్నూర్ మండలం పులిమడుగు వద్ద నిర్మించనున్న బ్రిడ్జి పనులకు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు సుమారు 4.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ బ్రిడ్జి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారనుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సంప్రదాయ పద్ధతిలో టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం పనులు చేపట్టనున్న కాంట్రాక్టర్ మరియు ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు బ్రిడ్జి నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలానికి ముందుగానే పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం రోడ్లు, భవనాలు వంతెనలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడితే స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులు చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు పులిమడుగు ప్రాంత ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఈ వంతెన పూర్తయిన తర్వాత సమీప గ్రామాల ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.