పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 08 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండలంలో ఎంపీడీవో ప్రభావతి దేవి శనివారం అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్యం, చదువు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యత, శుభ్రత, వంట విధానం వంటి అంశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం సకాలంలో అందజేయాలని ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.