అంగరంగ వైభవంగా చెర్లకొండాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర

పయనించే సూర్యుడు, చెర్లకొండాపూర్ మార్చి 8 చెర్ల కొండాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాద స్వీకరించారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో రథాన్ని తిప్పారు. భక్తులకు రథం పైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శనమిచ్చాడు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేవుని నారాయణ, గ్రామ సర్పంచ్ దేవుని రవి,ఆర్మూరి లక్ష్మి నారాయణ, అల్లకొండ సుదర్శన్, గోపి రాజారెడ్డి,ఏసాల సాయిరెడ్డి, పిప్పోజీ మహేందర్, శ్రీహరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.