అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకునిమహిళలకు శాలువాతో సన్మానించి.

పయనించే సూర్యుడు న్యూస్:మార్చ్/08:నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేశన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోతరాజు చంటి, అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మన గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సంఘాల సభ్యులను సర్పంచ్ పోతరాజు చంటి, మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో మహిళలకు శాలువాతో సన్మానించి, గౌరవించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కుటుంబ భారంతో పాటు సామాజిక బాధ్యతలను నెరవేరుస్తున్న మహిళల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మహిళా సాధికారతతోనే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. గ్రామ మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వజ్జపల్లి శ్రీకాంత్ వార్డు సభ్యులు సంజీవరావు మధు .లక్ష్మీ పంచాయతీ శ్రీనివాస్. సీఏ రాజు గ్రామం మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.