పయనించే సూర్యుడు మార్చి భీమదేవరపల్లి:- ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని న్యూ మోడల్ పాఠశాల కరస్పాండెంట్ బేరే యాదగిరి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ అధ్యాపకులకు పాఠశాల కరస్పాండెంట్ వారిని శాలువాతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు మహిళల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని, తమ హక్కులను తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు అధ్యాపకులు గోపాల్ రెడ్డి గంప సురేష్ కర్ణ శ్రీ అనురాధ పద్మ సంధ్యారాణి స్వప్నిక విజేత తో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు..