పయనించే సూర్యుడు మార్చి 8, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) స్త్రీ పురుష సమానతతోనే సమాజం సంపూర్ణ శాస్త్రీయ అభివృద్ధి సాధిస్తుందని ఆ దిశగా మహిళలను గౌరవించాలని ఏపీఐఐసీ ఉప జనరల్ మేనేజర్ పద్మజ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కులు కల్పించారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణించాలంటే తమ హక్కులను కాపాడుకుంటూ విధాన నిర్ణయాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. సిడిపిఓ వై. లక్ష్మి మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం పిడికిలి బిగించి పోరాడాలని ఇందుకుగాను ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో సిడిపిఓ వై. లక్ష్మి, ఏపీఐఐసీ ఉప జనరల్ మేనేజర్ పద్మజ, సామాజికవేత్త పితాని లక్ష్మి కుమారి లను ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, ఎస్. శ్రీ నగేష్, ప్రసాద్ నాయుడు, బుద్ధరాజు సత్యనారాయణ రాజు, చింతపల్లి సుబ్బారావు, కే. లక్ష్మి, బి .మాధవి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.