
పయనించే సూర్యుడు మార్చి 8 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు పట్టణంలోని 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశీలించిన విద్యుత్ శాఖ తిరుపతి ప్రధాన కార్యాలయ విద్యుత్ టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య. వీరితోపాటు విద్యుత్ డిఈ భానునాయక్, ఏడిఈ చిన్న స్వామి నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.సబ్స్టేషన్ లోని అన్ని పవర్ పాయింట్లను పరిశీలించి వాటి పనితీరును తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే విద్యుత్ విభాగాలను పరిశీలించుకోవాలని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు నెల్లూరు పాలెం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మత్తు కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అనంతరం ఆత్మకూరు విద్యుత్తు డివిజన్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.నూతన సబ్ స్టేషన్ ల ఏర్పాటు విద్యుత్ తీగలు మరియు వాటి సంబంధించిన పరికరాలు కావలసిన వాటి వివరాలు సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఎం&పి ఈఈ లక్ష్మీనారాయణ. ట్రాన్స్ఫార్మర్స్ డి ఈ. ఉదయగిరి ఏడీఈ ఇతర ఏఈలు. ఎల్ ఐ, లైన్మెన్. సిబ్బంది పాల్గొన్నారు