పయనించే సూర్యుడు మార్చి 8 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు బిల్లుల చెల్లింపులు నిర్మాణ సామగ్రి సరఫరాలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు గ్రామంలో మిగిలిన లబ్ధిదారుల ఇళ్ల పనులు కూడా త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు పనులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దీపక్, ఏఈలు రాథోడ్ వంశీ, దివ్య, పంచాయతీ కార్యదర్శి ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.