పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.08.2026 పోలవరం జిల్లా,గంగవరం లో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు మోడిద నూకరాజు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిస్థితి రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు హాజరై మాట్లాడుతూ…భారత రాజ్యాంగం ఆదివాసులు కల్పించిన ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్ కి కూడా రీసర్వల్ చేస్తూ ఏజెన్సీ ఆక్రమిత భూములకు హక్కులు కల్పిస్తున్నారని. ఆయన ఆవేదన వ్యక్తపరిచారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షెడ్యూల్ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ కి ఎటువంటి హక్కులు కల్పించవద్దని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఏజెన్సీ అధికారులు కోర్టు ఉత్తర్వులు తుంగలోకి తొక్కి ప్రవర్తిస్తున్నారని.ఆయన మండపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతాలలో నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడం తక్షణమే తొలగించాలని ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో న్యాయస్థానాల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోవడంతో నాన్ ట్రైబల్స్ విచ్చలవిడిగా వలసలు వచ్చి ఏజెన్సీ భూములు దోచుకుంటున్నారని ఎల్ టి ఆర్ చట్టంలోని క్రిమినల్ సెక్షన్లు కూడా ఉపయోగించి ఏజెన్సీ భూములు ఆక్రమిస్తున్న నాన్ ట్రైబల్ పై క్రిమినల్ కేసులు అట్రాసిటీ కేసులు నమోదు. చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఏజెన్సీ చట్టాలని పటిష్టంగా అమలు చేయనటువంటి అధికారులపై సెక్షన్ సిక్స్ ఏ వన్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివాసి చట్టాలు పట్టిష్టమలుకై ఉద్యమంలో ఉధృతం చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ కోఆర్డినేటర్ పీఠ ప్రసాద్,నాయకులు కంగాల అబ్బాయి దొర,చోడి ఏడుకొండలరావు, మడకం శివ, కలుముల ప్రసాద్ దొర.తదితరులు పాల్గొన్నారు.పీఠ ప్రసాద్ ఆదివాసి సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ కోఆర్డినేటర్.