కూటమితోనే రాష్ట్రాభివృద్ధి : యల్లటూరు

పయనించే సూర్యుడు-08-03-2026-రాజంపేట న్యూస్ : కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇన్చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. శనివారం తాళ్లపాక పంచాయతీ పరిధిలో నూతన సిమెంటు రోడ్డును గ్రామ ప్రజల సమక్షంలో ఆయన పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వె యల్లటూరు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలలో రోడ్లు నిర్మాణాలతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం పరుగులు పెడుతున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా తాళ్లపాక రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపాక ఉప సర్పంచ్ బాలరాజు సుమన్ రాజు, బాలరాజు శేఖర్ రాజు, ఎర్రగుడి రాజశేఖర్ రాజు, సుబ్బరాజు, జవ్వాజి హరి, జవ్వాజి వంశీ, చంటి, హరి, శ్యామల బోయిన సూరి, ఆళ్లగడ్డ రామ్మోహన్ రాజు, కృష్ణంరాజు, నీలి శేఖర్, రుద్రరాజు నాగేశ్వర రాజు, భూపతి మల్లిఖార్జున, అనిల్, గూడూరు శ్రీనివాసరాజు, రేనాటి రాకేష్, తిరుమల తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *