
పయనించే సూర్యుడు, మార్చి 7, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ టౌన్ న్యూస్ హనుమాన్ నగర్, శనివారం స్థానిక దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు రోబోటిక్స్,సైన్స్ నాలెడ్జ్ అవగాహన ఈవెంట్ “కెటిఎస్ ఆవిష్కార్ రోబో ఫెస్ట్-2026” కార్యక్రమాన్నిఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన డిఎస్పి శ్రీనివాసరావు , సిఐ వెంకట్ రెడ్డి మరియు గౌరవ అతిథిగా విచ్చేసిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ రఘువీరా చారి ,రోబోటిక్స్ వ్యవహార కర్త శర్మగారు జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డి.ఎస్.పి శ్రీనివాసరావ మాట్లాడుతూ “నేడు అత్యంత అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటిగా ఉన్న రోబోటిక్స్ పిల్లలు తమ జీవితంలో ప్రారంభ దశలోనే నేర్చుకున్నట్లయితే వారికి ప్రయోజనం చేకూరుతుందని, రోబోటిక్స్ వల్ల పిల్లల్లో ఊహ, ఏకాగ్రత, శ్రద్ధ మరియు పరిశీలన నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ” ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందని,స్కిల్ డెవలప్మెంట్ సామర్థ్యం ఉన్నవారే ఉపాధి పొందుతున్నారని, టెక్నాలజీ ఉపయోగించుకొని యువత నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రాజ్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ నవీన్ గౌడ్ , వైస్ ప్రిన్సిపల్ అన్వర్ హుస్సేన్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.