పయనించే సూర్యుడు మార్చి 8 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. ఒకరోజు ముందుగానే ఆదోని పట్టణంలోని ఆర్పి మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గుడిసే ఆది కృష్ణమ్మ నివాసం(క్యాంప్ ఆఫీస్) నందు మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా మహిళలందరితో కలిసి కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది.మహిళ అంటే శక్తి… మహిళ అంటే సాహసం… మహిళ అంటే సృష్టి.” సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమైనది. కుటుంబానికి ధైర్యం, సమాజానికి దారిదీపం, దేశానికి బలంగా నిలిచే ప్రతి మహిళకు మనస్పూర్తిగా వందనాలు.ప్రతి రంగంలో తమ ప్రతిభతో ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళలందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.మహిళల గౌరవం, భద్రత, సమాన హక్కులు కలిగిన సమాజం కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం.
