చిన్న మాసన్ పల్లి ప్రాథమిక పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు.

★ అభినందించిన ప్రాధానోపాధ్యాయులు మద్దూరి శ్రీకాంత్, ఉపాధ్యాయురాలు కళ్యాణి.

పయనించేసూర్యుడుదౌల్తాబాద్ మార్చి 8 రాజేష్) రాయపోల్ మండలం చిన్న మాసన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మద్దూరి శ్రీకాంత్ ఉపాధ్యాయురాలు కళ్యాణి ఆధ్వర్యంలో స్వయంపాలన దినోత్సవం వేడుకలు గణంగా జరిగాయి,ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయుల బాధ్యతలను తెలుసుకోవడానికి అలాగే చదువుతో పాటు క్రీడలు క్రమ శిక్షణ పద్ధతులను విద్యార్థులు తెలుసుకొవేయడానికి అనుకూలమని అలాగే కొంత వరకు తమ ఆలోచన విధానం మారుతూ ఉపాధ్యాయ వృత్తి దశను ఆలోచన విధానంతో కూడిన నైపుణ్యాన్ని అలవర్చుకోవడానికి ఈ స్వయం పాలన దినోత్సవాన్ని ప్రభుత్వం జరపడం కూడా ఒక గొప్ప అవకాశం గా భావిస్తూ ,విద్యను బోధించే ఉపాధ్యాయులు సైతం ఈ రోజు ను తమ విద్యార్థిని విద్యార్థులకు అంకితమిస్తూ విద్యార్థి దశను ఉపాధ్యాయులై చూసి పరితపించే ఒక గొప్ప అవకాశం గా భావిస్తూ ఈ పర్వ దినాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఉపాధ్యాయుల తల్లి దండ్రులు,స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ ఎండి జరీనా,హెడ్ కుక్ ప్రేమలత
తదితరులు పాల్గొన్నారు.