చేగుంట గ్రామపంచాయతీ మహిళా గ్రామ సభ సర్పంచ్ సండ్రుగు స్రవంతి ఆధ్వర్యంలో జరిగింది

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 8 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల గ్రామపంచాయతీ దగ్గర మహిళా గ్రామసభ సర్పంచ్ స్రవంతి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ ఉప సర్పంచ్ వారు మాట్లాడుతూ మార్చి 8 వ తారీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అక్కడికి వచ్చిన మహిళలతో మాట్లాడి వారికి గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని అన్నారు మహిళలు ఎదగాలి అన్ని రంగాలలో ముందుండాలి అని అన్నారు అనంతరం కేక్ కట్ చేయడం జరిగినది . ఈ కార్యక్రమంలో సర్పంచ్ సండ్రగు స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహ్మద్ రఫీ, ఈవో వెంకటేశం, గ్రామపంచాయతీ పాలకవర్గం, మహిళ గ్రూపు సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, ప్రభుత్వ దావకా నా స్టాప్, గ్రామపంచాయతీ స్టాఫ్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *