తాడిచెట్టు నుండి పడి మృతి చెందిన కమ్మగాని సోమన్న కుటుంబానికి కానా ఆర్థిక సహకారం

పయనించే సూర్యుడు మార్చి 8(జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు కమ్మగాని సోమన్నగౌడ్ ఇటీవల వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కింద పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వారి కుటుంబం వారి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు అతని కుటుంబానికి సహకారం అందించవలసిందిగా కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ బాధ్యులను కోరడం జరిగింది. వారు మనం చేసిన విజ్ఞప్తిని మన్నించి అట్టి కుటుంబానికి కానా తరపున 20,000 వెయ్యిల ఆర్థిక సహకారాన్ని అందించుటకు గాను సంస్థ స్థానిక ప్రతినిధి నాతి గణేష్కి చెప్పడం జరిగింది. వారు ఈరోజు ఆట్టి డబ్బులను కుటుంబానికి అందించవలసిందిగా కేజీ కేఎస్ జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్యకి చెప్పడంతో ఈరోజు మృతుని కుటుంబం ఇంటికి వెళ్లి వారి భార్య కమ్మగాని సరితకు 20,000 వెయ్యిల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా పాలకుర్తి మండల కేంద్రంలో ఇటీవల తాటి చెట్టు నుంచి పడి తీవ్ర గాయాలైన కమ్మగాని అనిల్ ను ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స తీసుకుంటున్న వ్యక్తిని పరామర్శించారు మాజీ పాలకుర్తి వార్డ్ సభ్యుడు కమ్మగారి రమేష్ కు వరంగల్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొంది వచ్చిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగినది ఈ సందర్భంగా తను మాట్లాడుతూ చేతివృత్తులలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తి వృత్తిలో మృతి చెందిన గీత కార్మికుడి కమ్మగాని సోమన్న కుటుంబానికి ఆర్థిక సహకారం అందించిన కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థకు కల్లుగీత కార్మిక సంఘం జనగామ జిల్లా కమిటీ తరఫున పాలకుర్తి గౌడ సొసైటీ తరఫున వారి కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్టి కార్యక్రమంలో కేజీ కేస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కమ్మగాని నాగన్న జిల్లా కమిటీ సభ్యులు కమ్మగాని పరశురాములు, తాళ్లపల్లి మదర్, బండి కొండయ్య, పాలకుర్తి సర్పంచ్ విజయ నాగన్న,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మిట్ట బిక్షపతి ,కుల పెద్దమనిషి కమ్మగాని సారంగం, జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్, కే సారంగం ,కమ్మగానిబి దామందర్ ,కమగాని సుధాకర్, బత్తిని రాజు, కమ్మగాని పరమేష్, కమ్మగాని యాకయ్య ,తదితరులు పాల్గొన్నారు