పయనించే సూర్యడు /మార్చ్ 08/ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం పట్ల ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నాయకులు వేం నరేందర్ రెడ్డిని స్వయంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులకు సముచిత స్థానం కల్పించడం సంతోషదాయకమని వారు పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి అనుభవం రాజ్యసభలో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేందుకు దోహదపడుతుందని ఆకాంక్షించారు. ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్, రామంతపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తవిడబోయిన గిరిబాబు, ఏ బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సుర్వి మురళి గౌడ్, ఎడవల్లి నరసింహా తదితరులు ఉన్నారు.