పయనించే సూర్యుడు మార్చి 08, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కామన్ ఎగ్జామ్‌కు అవసరమైన మెటీరియల్‌ను పంపిణీ చేశారు. నాగులవంచ గ్రామానికి చెందిన శ్రీ వంకాయలపాటి సీతయ్య–సుగుణమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ విద్యా సామగ్రిని విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు కార్యక్రమంలో వంకాయలపాటి సత్యనారాయణ, కొల్లి బాబు, హైస్కూల్ హెచ్‌ఎం కనపర్తి వెంకటేశ్వర్లు, వెంకటరత్నం, చందర్రావు, రత్నకుమారి, వీరప్రసాద్, జయలక్ష్మి, రమేష్, అబ్దుల్ మియా మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.