పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 8 పెనుగంచిప్రోలు గ్రామం లో ని ఈరోజు న శృతి కన్వెన్షన్ హాల్ నందు వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన కొల్లిపర యజ్ఞ నారాయణశర్మ-జయలక్ష్మి కుమారుడు సత్యనారాయణ శర్మ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెనుగంచిప్రోలు గ్రామం స్నేహ గార్డెన్స్ నందు వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన బొర్రా హనుమంతరావు-నాగమల్లేశ్వరి(లేటు) కుమారుడు గోపీచంద్ వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి-నాగేశ్వరరావు, సింగవరం సర్పంచ్ పొన్నపోలు ప్రశాంతి-సురేష్ ,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట్ల వెంకటరెడ్డి, అనిగండ్లపాడు గ్రామ పార్టీ ఉన్నం శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గొర్రెపాటి బుల్లయ్య, నియోజకవర్గ రైతు అధ్యక్షులు కనగాల రమేష్, నియోజకవర్గ పంచాయతీ రాజ్ అధ్యక్షులు వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నల్లబోతుల వెంకటేష్, ఉబ్బల రంగా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *