పయనించే సూర్యుడు మార్చి 08 ,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల మరియు అంగన్వాడి భవనంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామ సర్పంచ్ తాళ్ళూరి స్వప్న శనివారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం మరియు అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న మాట్లాడుతూ గ్రామంలోని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థ వంటి సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. అలాగే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి వార్డు సభ్యుడు తోటకూరి హరీష్, గ్రామ కార్యదర్శి చామర్తి కృష్ణమాచారి, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం పి. వెంకటేశ్వరావు, అంగన్వాడి టీచర్ కాసిమాల వెంకమ్మ, కాంగ్రెస్ నాయకులు సింగ్ కిషోర్, కాశీమల సుధాకర్, అలవాల నాగేశ్వరావు, ఆయా పద్మ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.