ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించినమేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్

పయనించే సూర్యుడు మార్చి 8 ఖానాపురం మండల కేంద్రం నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉపయోగపడుతుందని సర్పంచ్ దాసరి రమేష్ అన్నారు ఈ సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను సర్పంచ్ దాసరి రమేష్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు అనంతరం అంగడి సెంటర్ లో పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చి చెత్తను పోగు చేశారు అనంతరం స్కూల్స్ బస్టాండ్ ఆవరణలో శుభ్రత పనులను చేపట్టినట్లు సర్పంచ్ రమేష్ తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ తో గ్రామంలో పేరుకుపోయిన పారిశుద్ధ్య పరిసరాల పరిశుభ్రత సంస్థాగత నిర్వహణ పాలనపై ప్రజలకు అవగాహన ఉంటుందని ముఖ్యంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు పారిశుధ్య డ్రైనేజీ సమస్యాత్మకంగా సమస్యలకు నిలువైన వార్డులను గుర్తించి తక్షణమే పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు ఈ యాక్షన్ ప్లాన్ మార్చి 06 నుండి జూన్ 12 వరకు ఉంటుందని గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు ముఖ్యంగా యువకులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు పల్నాటి నిర్మల కందుల రమాదేవి కామిశెట్టి లక్ష్మి గుండ్లపెళ్లి విజయ్ వేములపల్లి వెంకటప్రసాద్ రావు భూక్య స్రవంతి ఈలపొంగు కొమురమ్మ అరిఫా ఎండి అజహార్ పంచాయతీ సిబ్బంది పేర్ల రాములు షఫీ సిబ్బంది గాజుల వీరస్వామి వెంకటమ్మ ఐలయ్య యాకుబ్బీ పార్వతమ్మ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు