ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ఆబోతు శ్రీలత అశోక్ యాదవ్

పయనించే సూర్యుడు మార్చి 8 ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామం గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉపయోగపడుతుందని సర్పంచ్ అన్నారు ఈ సందర్భంగా గ్రామకేంద్రంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు గ్రామంలో పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చి చెత్తను పోగు చేశారు అనంతరం స్కూల్స్ అంగన్వాడీ ఆవరణలో శుభ్రత పనులను చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ తో గ్రామంలో పేరుకుపోయిన పారిశుద్ధ్య పరిసరాల పరిశుభ్రత సంస్థాగత నిర్వహణ పాలనపై ప్రజలకు అవగాహన ఉంటుందని ముఖ్యంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు పారిశుధ్య డ్రైనేజీ సమస్యాత్మకంగా సమస్యలకు నిలువైన వార్డులను గుర్తించి తక్షణమే పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ యాక్షన్ ప్లాన్ మార్చి 06 నుండి జూన్ 12 వరకు ఉంటుందని గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు ముఖ్యంగా యువకులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొడుగు రామ యాకన్న వార్డు మెంబర్లు ఆబోతు రవికుమార్ కొరివి రాజు మేకల లింగమ్మ షేక్ మీరా సాబ్ షేక్ మెహ్రూనిస మేకల వరదయ్య మరియు అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు మరియు గ్రామంలోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు