పయనించే సూర్యుడు మార్చి 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శనివారం నాడు మహిళా దినోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని ఆసుపత్రి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ ఆర్.రవిశంకర్ నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంసూచించిన100 రోజుల ప్రణాళికలో భాగంగానిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే దేశ అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో ప్రవేశించి ఉన్నత స్థితికి తోడ్పాటు అవుతున్నారని అన్నారు. సామాజిక రంగం అభివృద్ధి చెందుటకు మహిళా సాధికారకత సాధించడం అవసరం అన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ శ్రీవాణి ఆసుపత్రిలోని మహిళా నర్సింగ్ అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపర్డెంట్ మంజుల, హెడ్ నర్స్ పద్మ, రాధా, సునీత ,స్వెత. ముత్యం నర్సింగ్ అధికారులు జానకి దేవి, మరియమ్మ ,సరస్వతి, పుష్పలత,ఆనంద్.కెశవ్. ,మల్లేష్, బీమ్ లాల్, అరుణ్, కిరణ్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.