బాపనమ్మ కుటుంబానికి న్యాయం జరగాలి.

★ వైద్యులపై చర్యలకు ఆదేశించండి. ఎస్టి కమిషన్ చైర్మన్ కు వినతి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.08.2026 శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ షెడ్యూల్ తెగల కమీషన్ చైర్మన్ చోళ్ళ బొజ్జి రెడ్డి వారిని కలిసి రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది కారణంగా మృతి చెందిన బాపనమ్మ భర్త రాజన్న దొర మరియు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వారితో మాట్లాడుతూ… అక్టోబర్ 10న రంపచోడవరం నర్సాపురం గ్రామానికి చెందిన కోటం బాపనమ్మ ప్రసవం కోసం ఏరియా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగిందని. బాపనమ్మ, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అక్టోబర్ 20న మృతి చెందడం జరిగింది. మరియు పుట్టిన శిశువు కూడా మరణించడం జరిగిందని. మాత శిశు మరణాలకు రంపచోడవరం వైద్యులు నిర్లక్ష్యమే కారణమని దీనిపై పలుమార్లు ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో కూడా పిర్యాదు. చేసి ఉన్నాము. అదేవిధంగా జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ కు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు,రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ కు కూడా ఫిర్యాదు. చేసి ఉన్నామని. కమిషన్ ల నుండి నోటీసులు వచ్చినప్పటికీ ఇప్పటివరకు బాపనమ్మ కుటుంబాలకి ఏటువంటి న్యాయం చేయలేదని. మాత శిశువులకు కారకులైన వైద్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు కావున దీనిపై తగు చర్యలకు ఆదేశించాలని కోరుతూ అదేవిధంగ బాపనమ్మ కుటుంబాని న్యాయం చేయాలని కోరాటం జరిగింది. దీనిపై స్పందించిన చైర్మన్ తగు న్యాయం చేస్తామని తెలియజేశారు. వారు ప్రతికపరంగా తెలియజేశారు. కుంజ శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.