బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 8 మందమర్రి మండల రిపోర్టర్ బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా పట్టణంలోని గాంధీ పార్క్ లో రాష్ట్ర ప్రభుత్వం బీసీల సామాజిక రక్షణ భద్రతకై బిసి యాక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ బీసీలలో అనేక కులాలు కుల వివక్షకు గురైనటువంటి కులాలు అనేకమైన సంచార జాతులు అర్థ సంచార జాతుల కులాలు ఊరికి ఆమడ దూరంలో జీవిస్తున్న సందర్భం దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న బీసీలపై వివక్ష కొనసాగుతుంది అలాగే దేశంలో రాష్ట్రంలో అనేక సందర్భాలలో బీసీ మహిళలు అత్యాచారాలకు గురై హత్యకు గురై ఉన్న సందర్భాలు ఉన్నాయి అలాగే కొన్ని కులాలను వెలివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో బీసీలపై అనేక దాడులు జరిగిన నేపథ్యంలో బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యాక్ట్ ఎంతో అవసరం అని తెలియజేస్తూ ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభం కాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ యక్ట్ పై చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గుమ్ముల శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య కర్రే లచ్చన్న వేముల అశోక్ రామగిరి రాజన్న చారి చంద్రగిరి చంద్రమౌళి పరిష శ్రీనివాస్ ఆరెందుల రాజేశం కంపరి వేణుగోపాల్ మురళి శేఖర్ అంకం సతీష్ తదితరులు పాల్గొన్నారు