బోధన్‌లో మహిళా కౌన్సిలర్లకు ఘన సన్మానం…

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 8 బోధన్:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలో గెలుపొందిన మహిళా కౌన్సిలర్లను బీజేపీ యువ నాయకులు ఘనంగా సన్మానించారు. పట్టణంలోని 11వ వార్డ్ కౌన్సిలర్ కొలిపాక రేణుక బాలరాజు, 29వ వార్డ్ కౌన్సిలర్ రాజుల దేవి లక్ష్మీ పూజిత పవన్ కుమార్, 33వ వార్డ్ కౌన్సిలర్ గుంత అబ్బవ్వ లను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మహిళలు రాజకీయాల్లో ముందుకు వచ్చి ప్రజాసేవ చేయడం అభినందనీయమని, వారి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని బీజేపీ యువ నాయకులు పేర్కొన్నారు.మహిళ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. తమపై చూపిన గౌరవానికి బీజేపీ యువ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేస్తామని, తమ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, వాసు,గుంత గంగాధర్,శ్రీకాంత్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *