మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ సాలురా గ్రామస్తులు కలెక్టర్ కు వినతి.

★ వినతి పత్రాన్ని సమర్పించిన గ్రామస్తులు.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 8 బోధన్ :సాలూర గ్రామంలోని పలు వార్డులలో తీవ్ర మంచినీటి కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ పలు వార్డుల ప్రజలు శనివారం సాలూర మండల కేంద్రానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రాన్ని సమర్పించారు.పలు వార్డులలో నీటి ఇబ్బందులు అనేక సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ స్థానిక అధికార యంత్రం నామమాత్రపు మరమ్మత్తులు చేసి చేతులు దులుపుకుంటున్నారని కలెక్టర్ కు తెలిపారు.నామమాత్రపు పరిష్కారాలతో మంచినీటి కొరత మరింత తీవ్రమైతుందే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విన్నవించారు.మంచినీటి కొరత వలన పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి వెళ్లలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.