మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధిస్తుంది-మాజీ ఎంపిపి ఆరెల్లి దేవక్క

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-08 నేటి సమాజంలో మహిళలు చదువు, ఉద్యోగం, రాజకీయాలు, క్రీడలు అన్నింటిలోనూ ముందంజలో ఉన్నారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొప్ప బలం. మహిళ సాధికారత అంటే కేవలం ఒక నినాదం కాదు అది ఒక సామాజిక విప్లవం. ప్రతి మహిళకు గౌరవం, సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం మన అందరి బాధ్యత.మహిళను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. మహిళలు ముందుకు వస్తే కుటుంబం ముందుకు వస్తుంది కుటుంబం ముందుకు వస్తే దేశం ముందుకు సాగుతుంది.అందుకే మనందరం మహిళల గౌరవాన్ని కాపాడుతూ, వారి అభివృద్ధికి తోడ్పడాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామగిరి మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్కకొమురయ్యగౌడ్ మండలంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆమె పత్రిక ప్రకటన విడుదల చేశారు. మహిళలందరూ సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని రాజకీయాల్లోకి సైతం రావాలని పిలుపునిచ్చారు. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నట్టుగా మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ది సాధించినప్పుడే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ది చెందుతాయని అన్నారు. మన రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకుని అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలులో ఉండటం వల్ల మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిన తరుణంలో అదే ఉత్సాహంతో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకోవాలని మహిళలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *