ముత్తారం ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

పయనించే సూర్యుడు మార్చి 08 భీమదేవరపల్లి:- ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊరడి భారతి జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ మాట్ల హరికుమార్, పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, వార్డు సభ్యులు కొర్ర తిరుపతి, పార్నందుల నవిత, రేణికుంట్ల సందీప్, దొండ మౌనిక పాల్గొన్నారు. వారు పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి శుభ్రపరిచారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రతను పాటించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రియదర్శిని, ఉపాధ్యాయులు రాజిరెడ్డి, మల్టిపర్పస్ వర్కర్లు ఫిలిప్, ప్రేమనందం, వెంకటమ్మ, వీరమ్మ, కొమురయ్య, సిబ్బంది లలిత తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *